రాజకీయ హత్య కాదు, కుటుంబ హత్యే.. వైసీపీ నేత కేశవరెడ్డి మర్డర్ మిస్టరీని ఛేదించిన పోలీసులు!
- ఆస్తి, ఇతర గొడవలే కారణం
- స్వయంగా స్కెచ్ వేసిన అన్న కొడుకు
- నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు
ఇందులో భాగంగా హత్య చేసేందుకు వారాదప్పను నరసింహారెడ్డి సంప్రదించాడని అన్నారు. హత్యకు రూ.10 వేలకు ఒప్పందం చేసుకుని అడ్వాన్సుగా రూ.వెయ్యి చెల్లించాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత కర్నూలుకు వెళ్లిన వీరు వేట కొడవళ్లను కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10న తోటకు వెళ్లి వస్తున్న కేశవరెడ్డిపై వేట కొడవళ్లతో దాడిచేశారు.
అనంతరం ఓ బండరాయితో తలపై మోది అక్కడి నుంచి పారిపోయారు. చివరికి వారి దాడి నుంచి కొనప్రాణాలతో తప్పించుకున్న కేశవరెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మంత్రి పరిటాల సునీత వర్గీయులే కేశవరెడ్డిని హతమార్చారని ఆయన బంధువులు అప్పట్లో ఆరోపించారు.