తనతో అసభ్యంగా ప్రవర్తించాడని... కొడుకును హత్య చేసిన యూపీ శాసన మండలి ఛైర్మన్ భార్య
- మృతదేహాన్ని శవపరీక్షకు తరలించిన పోలీసులు
- గొంతు నులిమి హత్య చేసినట్టు నిర్ధారణ
- తానే హత్య చేసినట్టు పేర్కొన్న మీరా యాదవ్
అభిజిత్ మరణవార్త తెలుసుకున్న పోలీసులు అతని ఇంటికి వెళ్లారు. దీంతో హడావుడిగా అతని కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అక్కడి పరిస్థితిని చూసి అనుమానించిన పోలీసులు మృతదేహాన్ని శవపరీక్షకు తరలించారు. అభిజిత్‌ను గొంతు నులిమి హత్య చేసినట్టు శవపరీక్షలో తేలింది. అభిజిత్ తల్లి కాస్త అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు ఆమెను విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తాగిన మైకంలో తన కొడుకు తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో తానే హత్య చేశానని మీరా పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.