శ్రీకాకుళం జిల్లాకు మరో ముప్పు.. ‘గజ’గజ లాడించనున్న తుపాను!
- ఈ నెల 23న ఏర్పడే అవకాశం
- నాలుగు రోజుల ముందు స్పష్టత
- వాతావరణ శాఖ బులెటిన్ విడుదల
దీనిపై స్పష్టత రావాలంటే మరో నాలుగు రోజులు ఆగాల్సిందేనని వెల్లడించింది. ఈ మేరకు ఓ బులెటిన్ ను విడుదల చేసింది. అల్పపీడనం తొలుత బలపడి వాయుగుండంగా, ఆ తర్వాత తుపానుగా మారినప్పుడే దాని గమనం తెలుస్తుందని వాతావరణశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మరోసారి బంగాళాఖాతంలో తుపాను వస్తే దానికి ‘గజ’ అని పేరు పెడతామని వెల్లడించారు. తుపాను ఏర్పాటుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయనీ, అయితే అప్పుడే ప్రజల్లో తుపాను గురించి వదంతులు రెచ్చగొట్టడం సరికాదని వ్యాఖ్యానించారు.