: అవినీతి మంత్రుల్ని బర్తరఫ్ చేయాల్సిందే: బాబు
రాష్ట్ర మంత్రుల్లో అవినీతికి పాల్పడిన వారిని వెంటనే బర్తరఫ్ చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు రేపు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి బాబు గవర్నర్ నరసింహన్ ను కలవనున్నారు. వోక్స్ వాగన్ వ్యవహారంలో బొత్స, గనుల కుంభకోణంలో సబిత, భూమి వ్యవహారంలో రాంరెడ్డి వెంకట్ రెడ్డి, మనీలాండరింగ్ ఉదంతంలో శైలజానాథ్, ఎమ్మార్ కేసులో ధర్మాన.. ఇలా పది మంది వరకు మంత్రులకు అవినీతి మకిలి అంటిందన్న బాబు.. వారిని ఇంకా క్యాబినెట్ లో కొనసాగించడం దారుణమన్నారు.