: తెలంగాణలో పెళ్ళికి హాజరైన నారా లోకేశ్
నారా లోకేశ్ నేడు తెలంగాణలో ఓ వివాహానికి హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా టీడీపీ నేత గూడూరి రాంరెడ్డి కుమార్తె పెళ్ళికి విచ్చేసిన లోకేశ్ వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహం హుజూరాబాద్ లో జరిగింది. కాగా, లోకేశ్ వెంట టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇనగాల పెద్దిరెడ్డి, నియోజకవర్గ ఇన్ ఛార్జి ముద్దసాని కశ్యప్ తదితరులున్నారు.