ఆరోగ్యం ఎలా ఉందన్నా?: మాజీ ఎమ్మెల్యేతో జగన్!
- ప్రస్తుతం విజయనగరం జిల్లాలో జగన్ పాదయాత్ర
- గజపతినగరం శివారులో జగన్ క్యాంప్
- సీనియర్ నేత పెన్మత్సతో కలసి వచ్చిన తాడ్డి సన్యాసప్పలనాయుడు
తనకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ఎంతో అభిమానమని, వైఎస్ కుటుంబానికి ఎప్పుడూ విధేయులుగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. వైకాపా సీనియర్ నేత పెన్మత్స సాంబశివరాజు, తాడ్డిని జగన్ విశ్రాంతి తీసుకుంటున్న శిబిరానికి తీసుకువచ్చారు. గత కొంతకాలంగా వృద్ధాప్యం కారణంగా వచ్చిన అనారోగ్య సమస్యలతో తాడ్డి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.