రాజకీయ రంగు పులిమి తప్పించుకుందామని చూస్తున్న సీఎం రమేష్: జీవీఎల్
- తప్పు చేసిన వారికి ఎప్పటికైనా శిక్ష
- తప్పులను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీపై అభాండాలు
- సీఎం రమేష్ అవినీతిపై ఐటీ అధికారుల వద్ద ఆధారాలు
- బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు
ఇతర పార్టీల ప్రముఖులపైనా ఇటువంటి సోదాలు జరుగుతున్నాయని, ఆదాయపు పన్ను శాఖ అధికారులకు ఎవరి లావాదేవీలనైనా పరిశీలించే అధికారముందని చెప్పారు. కాంగ్రెస్ కేంద్రంలో ఉన్న వేళ కూడా ఐటీ సోదాలు జరిగాయని జీవీఎల్ అన్నారు. సీఎం రమేష్ అవినీతిపైనా, పన్నుల ఎగవేతలపైనా ఐటీ అధికారుల వద్ద ఆధారాలు ఉన్నాయనే తాను భావిస్తున్నానని చెప్పారు.