bjp: డబ్బు కోసమే మహిళలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు: బీజేపీ ఎంపీ ఉదిత్ రాజ్

  • ఇలాంటి ఆరోపణలు చేయడం అలవాటుగా మారింది
  • ఆరోపణలు చేసి లక్షల రూపాయలు గుంజుతారు 
  • అయితే, అన్ని కేసులను ఒకేలా చూడకూడదు

బాలీవుడ్ నటుడు నానాపటేకర్ పై తనుశ్రీ దత్తా, రచయిత చేతన్ భగత్ పై ఓ మహిళా జర్నలిస్టు ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ‘మీటూ ఉద్యమం’ స్ఫూర్తితో తమకు జరిగిన అన్యాయాన్ని బయటపెడుతున్న బాధిత మహిళల సంఖ్య పెరుగుతున్న తరుణంలో ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ ఉదిత్ రాజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

డబ్బు కోసమే కొందరు మహిళలు తమపై లైంగిక దాడులు జరిగాయని, వేధింపులకు పాల్పడ్డారని అంటూ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కొందరు మహిళలు డబ్బు కోసం ఇలాంటి ఆరోపణలు చేయడం అలవాటుగా మారిందని, వాళ్ల నుంచి రూ.2 నుంచి రూ.4 లక్షల వరకు గుంజుతారని, ఆ తర్వాత మరో వ్యక్తిపై ఆరోపణలు చేస్తారని ఆరోపించారు. అయితే, అన్ని కేసులను ఒకేలా చూడకూడదని, ఓ మహిళను లైంగికంగా దోచుకున్న వాళ్లను అక్కడికక్కడే కాల్చి పారేయండని మరోసారి చెబుతున్నానని ఉదిత్ రాజ్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News