చంద్రబాబు తెలంగాణ పక్షపాతిగా ఉండరు..ఉండలేరు!: మంత్రి హరీశ్ రావు
- చంద్రబాబు ఎప్పటికీ ఆంధ్రాబాబే
- తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతారా?
- కాంగ్రెస్- టీడీపీ పొత్తు షరతులతో కూడినదా? లేక బేషరతుగానా?
కృష్ణానదీ జలాల పంపిణీ జరగాలంటే.. చంద్రబాబు ఏపీ ప్రజల పక్షాన నిలబడతారా? తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతారా? ఈ విషయంలో స్పష్టత రావాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణలో చంద్రబాబునాయుడితో కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న పొత్తు షరతులతో కూడినదా? లేక బేషరతుగా పెట్టుకున్నారా? అని ప్రశ్నించారు. కేవలం, అధికారం కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ పొత్తుపెట్టుకుంటోందని మండిపడ్డారు.