‘క్వీన్’ దర్శకుడు ఓ నీచుడు.. నన్నూ లైంగికంగా వేధించాడు!: బాంబు పేల్చిన హీరోయిన్ కంగనా రనౌత్
- షూటింగ్ లో దర్శకుడు వికాస్ అసభ్య ప్రవర్తన
- గట్టిగా కౌలింగించుకునేవాడని ఆరోపించిన నటి
- వికాస్ చేతిలో వేధింపులకు గురైన యువతికి మద్దతు
వికాస్ వేధించినట్లు సదరు యువతి చెబుతున్నది వందకు వంద శాతం నిజమేనని వెల్లడించింది. ‘క్వీన్ సినిమా షూటింగ్ సమయంలో వికాస్ నన్ను ఎప్పుడు కలిసినా విష్ చేస్తున్నట్లు కౌగిలించుకునేవాడు. కానీ అతను కౌగిలించుకుంటున్నట్లు నటిస్తూ గట్టిగా నలిపేసేవాడు. అది ఎవరికీ తెలియకపోవడంతో అతని నుంచి తప్పించుకునేందుకు చాలా యత్నించేదాన్ని.
వికాస్ కు పెళ్లయినా పరాయి స్త్రీలతో సంబంధం ఉంది. ఇతరుల వ్యక్తిగత అలవాట్ల గురించి నేను తప్పుపట్టను. కానీ ఆ అలవాట్లు వ్యవసనంగా మారిపోయినప్పుడు బయటపెట్టడంలో తప్పులేదు. వికాస్ పార్టీల్లో బాగా తాగేవాడు. నేనేమో షూటింగ్ పూర్తయ్యాక హోటల్ గదికి వెళ్లిపోయి నిద్రపోయేదాన్ని. దీంతో నేను ఎక్కువగా నిద్రపోతానని ఎగతాళి చేసేవాడు’ అని కంగన చెప్పుకొచ్చింది.
‘క్వీన్’ సినిమా తర్వాత మరో స్క్రిప్ట్‌తో వికాస్ తనవద్దకు వచ్చాడనీ, అది నచ్చకపోవడంతో కథలో మార్పులు చేయాల్సిందిగా తాను సూచించానని కంగన తెలిపింది. దీంతో అహం దెబ్బతిన్న వికాస్ తనతో మాట్లాడటం మానేశాడని వెల్లడించింది. దీంతో ఆ ప్రాజెక్టు చేజారిపోయిందని పేర్కొంది. ఆ సినిమా ఇంకా పట్టాలెక్కలేదని చెప్పింది.