ధవళేశ్వరం బ్యారేజీపై జన సైనికుల కవాతు.. వివరాలు ప్రకటించిన జనసేన పార్టీ!
- ఈనెల 15న కవాతుకు ఏర్పాట్లు
- కార్యకర్తలు భారీగా వస్తారని అంచనా
- చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్న పార్టీ నేతలు
తొలుత ఈ యాత్రను రాజమహేంద్రవరం (రాజమండ్రి)లోని పాత బ్రిడ్జిపై ఈ నెల 2న నిర్వహించాలని భావించినప్పటికీ, కార్యకర్తలు చేరుకునేందుకు వీలుగా కార్యక్రమాన్ని వాయిదా వేశారు. తాజాగా ఈ నెల 15న జనసైనికుల కవాతు నిర్వహించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ట్విట్టర్ లో ప్రకటించింది.