Andhra Pradesh: ఏపీ మంత్రి వర్గంలో గిరిజనులకు ప్రాతినిధ్యం : కిడారి తనయుడికి ఛాన్స్‌?

  • చంద్రబాబు ఆలోచనగా రాజకీయ వర్గాల భోగట్టా
  • ఏజెన్సీ వాసుల్లో ఉత్సాహం నింపేందుకు ఉపకరిస్తుందని ఆలోచన
  • ఈ నెలలోనే విస్తరణ జరిగే అవకాశం

దివంగత అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడు కిడారి శ్రావణ్‌ను అమాత్య పదవి వరించనుందా? ఐఐటీ పట్టభద్రుడైన ఈ యువకుడిని మంత్రివర్గంలోకి తీసుకునే యోచన చంద్రబాబు చేస్తున్నారా? అంటే, అవునన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏజెన్సీ గిరిజనుల నుంచి సానుకూల ఫలితం సాధించాలంటే ఇదో మంచి ఆలోచన అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావిస్తున్నారని తెలుస్తోంది.

ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను ఇటీవల మావోయిస్టులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. కిడారి పెద్ద కొడుకు శ్రావణ్‌ ఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. రాష్ట్ర మంత్రి వర్గంలో ఇప్పటి వరకు గిరిజనులకు ప్రాతినిధ్యం లేదు. ప్రజా ప్రతినిధుల హత్య అనంతరం ఏజెన్సీలో నెలకొన్న ఓ విధమైన స్తబ్ధతకు తెరదించి గిరిజనుల్లో నూతనోత్సాహం రగిలించేందుకు ఈ ఆలోచన ఉపకరిస్తుందని చంద్రబాబునాయుడు యోచిస్తున్నట్లు సమాచారం. దీనివల్ల మంత్రివర్గంలో గిరిజనులకు ప్రాతినిధ్యం లేదన్న ఆరోపణకు ఫుల్‌స్టాఫ్‌ పెట్టినట్లవుతుందని భావిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని రాజకీయ వర్గాల భోగట్టా.

  • Loading...

More Telugu News