మహిళా కానిస్టేబుళ్లకు వైఎస్ జగన్ కీలక హామీ!
- విజయనగరం జిల్లాలో కొనసాగుతున్న యాత్ర
- ప్రతిపక్ష నేతను కలుసుకున్న మహిళా పోలీసులు
- అండగా ఉంటామని వైఎస్ జగన్ హామీ
కాగా, ఈ రోజు ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా మహిళా కానిస్టేబుళ్లు ప్రతిపక్ష నేతను కలుసుకున్నారు. విధుల నిర్వహణ సందర్భంగా తమకు ఎదురవుతున్న ఇబ్బందులను చెప్పుకున్నారు. కనీసం వారాంతపు సెలవులు కూడా లేకుండా, అవిశ్రాంతంగా పనిచేయాల్సి వస్తోందని వాపోయారు. అన్నింటిని సావధానంగా విన్న జగన్.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళా కానిస్టేబుళ్లకు వీక్లీ ఆఫ్ ఇస్తామని ప్రకటించారు. అలాగే పోలీస్ స్టేషన్లలో మహిళా ఉద్యోగులకు అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.