ఆసియా కప్ ఫైనల్లో ఓటమికి ప్రతీకారం.. కోహ్లీ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన బంగ్లాదేశీయులు!
- ఆసియాకప్ ఫైనల్లో భారత్ చేతిలో ఓడిన బంగ్లాదేశ్
- జీర్ణించుకోలేకపోతున్న బంగ్లా ఫ్యాన్స్
- ఐసీసీ క్షమాపణ చెప్పాలని డిమాండ్
వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన సీఎస్ఐ అందులో బంగ్లాదేశ్ ఓపెనర్ లిటన్ దాస్ స్టంప్ అవుట్ ఫొటోలను పోస్టు చేసింది. అంపైర్ల తప్పుడు నిర్ణయం వల్లే బంగ్లాదేశ్ ఓటమి పాలైందని ఆరోపిస్తూ అందులో లిటన్ దాస్ ఫొటోలను పోస్టు చేశారు. ఫైనల్లో సెంచరీ చేసిన లిటన్ దాస్.. ధోనీ చేతిలో వివాదాస్పద రీతిలో స్టంపౌట్ అయ్యాడు. పలుమార్లు రీప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్ లిటన్ దాస్ అవుటైనట్టు ప్రకటించాడు. ఇది వివాదాస్పదమైంది.
ఈ ఫొటోలను పోస్టు చేసిన హ్యాకర్లు, లిటన్ దాస్ ఎలా అవుటయ్యాడో చూశాక కూడా క్రికెట్ జెంటిల్మన్ గేమ్ ఎలా అవుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఐసీసీ క్షమాపణ చెప్పాలని, బహిరంగంగా క్షమాపణ చెప్పడం ఇష్టం లేకుంటే లిటన్ దాస్‌ను అవుట్ గా ప్రకటించిన అంపైర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. భారతీయులంటే తమకు కోపం లేదని, కానీ ఈ విషయంలో వారు కూడా ఓసారి ఆలోచించాలని కోరారు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని జట్లను సమానంగా చూడాల్సి ఉంటుందని హ్యాకర్లు పేర్కొన్నారు.