నేను మంచి ఆర్టిస్టును అవుతానని సావిత్రిగారు అప్పుడే చెప్పారు: సీనియర్ నటి ప్రభ
- సావిత్రి నన్ను దగ్గరికి తీసుకున్నారు
- మంచి ఆర్టిస్టువు అవుతావు అన్నారు
- నా బుగ్గపై ముద్దిచ్చి వెళ్లారు
ఆ సమయంలో ఆమె హడావిడిగా షూటింగుకి బయలుదేరుతున్నారు. సావిత్రిగారిని చూడటానికి నేను 'తెనాలి' నుంచి వచ్చినట్టుగా ఆమె మేనేజర్ చెప్పారు. వెంటనే ఆమె నన్ను దగ్గరికి తీసుకుని 'నేనంటే నీకు ఇష్టమా .. నా సినిమాలు చూస్తావా .. ఒక ఆర్టిస్టును ఇష్టపడ్డావంటే నీలో ఏదో వుంది .. నువ్ కూడా సినిమాల్లో చెయ్ బాగుంటుంది .. మంచి ఆర్టిస్టువు అవుతావు .. వెళ్లనా మరీ" అంటూ నా బుగ్గపై ముద్దు పెట్టుకుని వెళ్లిపోయారు. ఆ మహానటి ఎప్పటికీ బ్రతికే వుంటారు అని చెప్పుకొచ్చారు.