'నీడలేని ఆడది' కోసం ఒక డైలాగ్ చెప్పించి నన్ను ఓకే చేశారు!: సీనియర్ నటి ప్రభ
- పేపర్ ప్రకటన చూసి ప్రయత్నించాను
- సినిమా సూపర్ హిట్ అయింది
- తమిళంలో జయప్రభగా గుర్తించారు
'నీడలేని ఆడది' సినిమా కోసం పేపర్లో ప్రకటన రావడంతో ప్రయత్నించాను. నరసింహరాజు గారు .. నూతన్ ప్రసాద్ గారు .. అన్నపూర్ణమ్మ గారు .. పి.ఎల్. నారాయణ గారు ఈ సినిమాతోనే పరిచయమయ్యారు. ఈ సినిమా కోసం నన్ను పిలిపించి .. ఒక డైలాగ్ చెప్పించి ఓకే చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో నాకు మంచి పేరు వచ్చింది. ఇక్కడ నన్నంతా 'ప్రభ' గా ఆదరించారు .. తమిళ ప్రేక్షకులు మాత్రం 'జయప్రభ'గా గుర్తించారు. తమిళంలో నా తొలి సినిమా జయశంకర్ సరసన చేయడమే అందుకు కారణం'' అంటూ చెప్పుకొచ్చారు.