: రన్ రేట్ పై దృష్టి పెట్టిన సన్ రైజర్స్
పాయింట్ల పట్టికలో ఐదోస్థానంలో ఉన్నా, ఇంకా నాలుగు మ్యాచ్ లు ఆడాల్సి ఉన్నా.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును నెట్ రన్ రేట్ సమస్య వేధిస్తోంది. సన్ రైజర్స్ ఇప్పటివరకు ఐపీఎల్-6లో 12 మ్యాచ్ లాడి 7 విజయాలు, 5 పరాజయాలతో 14 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. అయితే, ఆ జట్టు నెట్ రన్ రేట్ -0.228గా ఉంది. కనీసం నాలుగో జట్టుగా ప్లే ఆఫ్ దశలోకి ప్రవేశించాలంటే రన్ రేట్ మెరుగుపరుచుకోవడం అత్యావశ్యకంగా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో సన్ రైజర్స్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ కు మొహాలీ మైదానం వేదిక. టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టుకు సంగక్కర స్థానంలో కామెరాన్ వైట్ సారథ్య బాధ్యతలు స్వీకరించాడు.