నా అన్నయ్యలు నన్ను ఎలా అర్థం చేసుకున్నారో నాకు తెలియదు: పవన్ కల్యాణ్
- నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నది అభిమానులే
- దెందులూరు ఎమ్మెల్యేల్లాంటోళ్లు యూపీ, బీహార్లో వీధికొకరు ఉంటారు
- అలాంటి వాళ్లను ఎదుర్కొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కాన్షీరామ్
తనకు కాన్షీరామ్ అంటే చాలా గౌరవమని... బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బహుజన్ సమాజ్ పార్టీని నిర్మించిన గొప్పనేత ఆయనని పవన్ తెలిపారు. దెందులూరు ఎమ్మెల్యేల్లాంటోళ్లు అక్కడ వీధికొకరు ఉంటారని... అలాంటి వాళ్లను ఛేదించుకుంటూ ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారని చెప్పారు. సంకల్పం బలంగా ఉంటే అనుకున్నది సాధిస్తామని తెలిపారు.