doraswamiraju: మా అబ్బాయిని హీరోను చేయకపోవడానికి కారణమదే: నిర్మాత దొరస్వామి రాజు

  • నాకు జాతకాల పిచ్చి ఎక్కువ 
  • మా అబ్బాయి జాతకం చూపించాను 
  • ఇతర నిర్మాతలకి ఆ సంగతి చెప్పాను

నిర్మాతగా .. డిస్ట్రిబ్యూటర్ గా సుదీర్ఘమైన ప్రయాణాన్ని కొనసాగించిన దొరస్వామి రాజు, తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. "కొంతకాలం క్రితం మీ అబ్బాయి హీరోగా మొదలైన సినిమా ఎందుకు ఆగిపోయింది?' అనే ప్రశ్న ఆయనకి ఎదురైంది. అందుకాయన స్పందిస్తూ .. మొదటి నుంచి కూడా నాకు జాతకాల పిచ్చి ఎక్కువ. మా అబ్బాయి జాతకం చూపిస్తే .. హీరో అయ్యే అవకాశం లేదని తెలిసింది.

నువ్వు హీరో అయ్యే అవకాశం లేదురా అని చెప్పేసి, మా అబ్బాయితో సినిమా చేయలేదు. వేరే నిర్మాతలు సినిమా చేస్తానంటే మా అబ్బాయి ఒప్పేసుకున్నాడు. 'మధ్యలో ఆపేస్తే దొరస్వామిరాజు చేసుకుంటారులే అనే ఉద్దేశంతో మా అబ్బాయితో సినిమా మొదలు పెట్టొద్దు. అలాంటివేం నా దగ్గర కుదరదు' అని చెప్పేశాను. నేను ఊహించినట్టుగానే వాళ్లు ఆ సినిమాను మధ్యలో ఆపేశారు. నేను అన్నట్టుగానే ఇక ఆ సినిమాను గురించి పట్టించుకోలేదు" అని చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News