: చెమటోడ్చిన 'ఇండియన్స్' !
పుణే బలహీనమైన జట్టే అయినా, గెలిచేందుకు ముంబయి ఇండియన్స్ శ్రమించాల్సి వచ్చింది. పుణేలో ఈ సాయంత్రం జరిగిన మ్యాచ్ లో ముంబయి 5 వికెట్ల తేడాతో పుణే వారియర్స్ పై నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన పుణే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు బరిలో దిగిన ముంబయి అవసరమైన మేర దూకుడు ప్రదర్శించలేకపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ (37), రాయుడు (26) రాణించడంతో 18.5 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. ఈ విజయంతో ముంబయి పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి ఎగబాకింది.