ఆయుష్షు గట్టిదే.. కారు పైనుంచి వెళ్లిపోయినా బతికిన పిల్లాడు.. వీడియో వైరల్!
- మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘటన
- షూ లేస్ ఊడిపోవడంతో కట్టుకుంటున్న పిల్లాడు
- చూడకుండానే కారు ఎక్కించేసిన యువతి
అయితే పిల్లాడిని గమనించని ఓ యువతి, కారును స్టార్ట్ చేసి అతనిపై నుంచి పోనిచ్చింది. దీంతో ఆ బాలుడిని కొద్ది దూరం తోసుకెళ్లిన కారు.. అనంతరం అతనిపై నుంచి వెళ్లిపోయింది. అయితే అదృష్టం కొద్దీ పిల్లాడు కారు మధ్యలోకి జారిపోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం తర్వాత బాలుడు లేచి స్నేహితుల దగ్గరకు పరిగెత్తాడు. అక్కడే ఏర్పాటుచేసిన సీసీటీవీల్లో ఈ ఘటన రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.