Chandrababu: చంద్రబాబు అధికారంలోకి రాగానే అన్నీ 'గోవిందా..గోవింద'!: వైఎస్ జగన్ సెటైర్లు
- సబ్సిడీలు, సంక్షేమ పథకాలు అన్నీ దూరమయ్యాయి
- అబద్ధాలు చెప్పే వాళ్లు నాయకులుగా కావాలా?
- కొత్త వలస బహిరంగ సభలో జగన్
చంద్రబాబు అధికారంలోకి రాగానే ‘అన్నీ గోవిందా.. గోవిందా’ అయ్యాయని వైసీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు చేశారు. విజయనగరం జిల్లా కొత్తవలసలోకి జగన్ ప్రజాసంకల్పయాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు అధికారంలోకి రాగానే మద్య నిషేధం, రెండు రూపాయలకు కిలో బియ్యం, వ్యవసాయం, వర్షాలు, గిట్టుబాటు ధరలు, పేదలకు ఇళ్ల నిర్మాణం.. ఇలా అన్నీ ప్రజలకు దూరమయ్యాయని చెబుతూ.. ‘గోవిందా’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు సీఎం కుర్చీలో కూర్చోగానే సబ్సిడీలు, సంక్షేమ పథకాలు ఎగిరిపోయాయని, నీతి ఎగిరిపోయిందని విమర్శించారు. అబద్ధాలు చెప్పే వాళ్లు, మోసాలు చేసే వాళ్లు నాయకులుగా కావాలా? అని ప్రజలను ప్రశ్నించారు.