: చీరకట్టులో తళుక్కుమన్న సమంత
సినిమాల్లో ఎక్కువగా ఆధునిక వస్త్రధారణలో కనిపించే అందాలతార సమంత నేడు చీరకట్టులో కనువిందు చేశారు. సమంత ఈరోజు ఉదయం సికింద్రాబాద్ శివారు ఎ ఎస్ రావు నగర్లోని అనుటెక్స్ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటించింది. అతివల సౌందర్యం సంప్రదాయ చీరకట్టులోనే వెల్లడవుతుందని అభిప్రాయపడింది. ఇక సినిమాల గురించి చెబుతూ, స్టార్ హీరోలు పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ల సరసన నటిస్తుండడం సంతోషాన్నిస్తోందని తెలిపింది. ఈ ఏడాది ఐదు సినిమాలు అంగీకరించానని, వేసవి అంతా షూటింగ్ లతో తలమునకలుగా ఉన్నానని చెప్పిందీ ముద్దుగుమ్మ.