'మోర్' ఇక అమెజాన్ సొంతం... డీల్ విలువ రూ. 4,200 కోట్లు
- 99.99 శాతం వాటాలను కొన్న ఎస్ఏఐఎఫ్, అమెజాన్
- రిటైల్ స్టోర్లను నడిపించనున్న అమెజాన్
- దేశవ్యాప్తంగా 575 మోర్ సూపర్, హైపర్ మార్కెట్లు
కాగా, ఈ డీల్ విలువ రూ. 4,200 కోట్లని తెలుస్తోంది. నిన్న జరిగిన ఆదిత్య బిర్లా గ్రూప్ అనుబంధ ఆర్కేఎన్ రిటైల్ లిమిటెడ్ బోర్డు సమావేశం ఈ డీల్ కు ఓకే తెలిపింది. (సీసీఐ) కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సహా ఇతర రెగ్యులేటరీ సంస్థల ఆమోదం తర్వాత కొనుగోలు, వాటాల బదిలీ ప్రక్రియ పూర్తి అవుతుంది.
ఇటీవలి కాలంలో ఇండియా ఆఫ్ లైన్ రిటైల్ మార్కెట్లో అమెజాన్ కు ఇది రెండో భారీ పెట్టుబడి. 2017 సెప్టెంబర్ లో షాపర్స్ స్టాప్ లో 5 శాతం ఈక్విటీని రూ. 180 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. భారత మార్కెట్ లో రూ. 500 కోట్ల డాలర్లను పెట్టుబడి పెట్టనున్నట్టు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ గతంలో వెల్లడించారు. ఇందులో భాగంగా ఇంతవరకూ 384 కోట్ల డాలర్లు (సుమారు రూ. 25,220 కోట్లు) ఆయన ఇప్పటికే ఇండియాకు తరలించారు.