ప్రబోధానంద ఆశ్రమాన్ని ప్రారంభించింది దివాకర్ రెడ్డే!.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటోలు
- 12 ఏళ్ల క్రితం జేసీ చేతుల మీదుగానే ప్రారంభం
- పుస్తకావిష్కరణలో పాల్గొన్న దివాకర్ రెడ్డి
- ఈరోజు సీఎంను కలసి ఫిర్యాదు చేసిన ఎంపీ

కేవలం ఆశ్రమాన్ని ప్రారంభించడమే కాకుండా ప్రబోధానంద స్వామి రాసిన ఓ పుస్తకాన్ని సైతం జేసీ ఆవిష్కరించిన ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు ప్రబోధానందస్వామి కొడుకు యోగానంద చౌదరి ఇటీవల బీజేపీలో చేరడంతో వివాదం రాజుకుందని ప్రబోధానంద ఆశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయ ఆధిపత్యం కోసమే జేసీ సోదరులు ఆశ్రమంపై కక్ష కట్టారనీ, ఘర్షణలు రెచ్చగొట్టారని వెల్లడించాయి.