దుబాయ్ కి బయలుదేరిన పాక్ ప్రధాని... హైటెన్షన్ మ్యాచ్ ని దగ్గరుండి చూస్తారట!
- నేడు చిరకాల ప్రత్యర్థుల మధ్య క్రికెట్ పోరు
- తమ జట్టును ఉత్సాహపరచనున్న ఇమ్రాన్ ఖాన్
- ఇప్పటికే అమ్ముడైపోయిన టికెట్లు
ఈ మ్యాచ్ కి సంబంధించిన అన్ని టికెట్లూ ఇప్పటికే అమ్ముడైపోయాయి. దుబాయ్ స్వతహాగానే పాకిస్థాన్ కు మద్దతు పలుకుతుంది. అయితే, ఈ మ్యాచ్ ని చూసేందుకు అక్కడున్న అసంఖ్యాకమైన భారతీయులు, వారి సంతతి టికెట్లను కొనుగోలు చేయడంతో స్టేడియంలోని గ్యాలరీలన్నీ కిక్కిరిసిపోవడం ఖాయం.