Chandrababu: ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ వెబ్‌సైట్‌ ను ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు

  • అక్టోబర్‌ 2 నుంచి నిరుద్యోగ భృతి అందించేందుకు సన్నాహాలు
  • ఆధార్‌ నంబర్‌ టైప్‌ చేయగానే అర్హత సమాచారం
  • ఏడాది క్రితం పీజీ, డిగ్రీ పూర్తి చేసిన తెల్ల రేషన్‌ కార్డుదారులు అర్హులు

ఎన్నికల హామీ ‘నిరుద్యోగ భృతి’ పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు పూర్తిచేసింది. అక్టోబర్‌ నుంచి వెయ్యి రూపాయల చొప్పున భృతి అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించి రూపొందించిన ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ వెబ్‌ సైట్‌ను సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారు. భృతి మాత్రమే కాక ఉపాధి, శిక్షణ, సంస్థలు, నిరుద్యోగుల సమాచారం కూడా ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉంటుంది. ఆధార్‌ నంబర్‌ టైప్‌ చేయగానే అర్హత సమాచారం కనిపిస్తుంది. 22 నుంచి 35 ఏళ్ల మధ్య వయసుండి ఏడాది క్రితం డిగ్రీ లేదా డిప్లొమా పూర్తిచేసిన తెల్ల రేషన్‌ కార్డు లబ్ధిదారులు భృతి పొందేందుకు అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది.

‘పోర్టల్‌ ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ఇదో చారిత్రక పథకం. సుదీర్ఘ అధ్యయనం, కసరత్తు తర్వాత పథకం అమలు చేస్తున్నాం. చరిత్ర సృష్టించబోతున్నాం. నా మనసుకు దగ్గరైన పథకం ఇది. యువత ప్రపంచాన్ని జయించే అంత శక్తిమంతులు కావాన్నది నా ఆకాంక్ష’ అని అన్నారు.

వెబ్‌ పోర్టల్‌ లింక్: http://yuvanestham.ap.gov.in/CMyuvaNapp/register.html

  • Loading...

More Telugu News