: పదవులొద్దు, గౌరవం కావాలి: దాడి
తాను పదవులను ఆశించి టీడీపీని వీడలేదని, గౌరవం ఇస్తే చాలని సీనియర్ రాజకీయ నాయకుడు దాడి వీరభద్రరావు అన్నారు. తాను జగన్ కు ఇదే మాట చెప్పానని దాడి వెల్లడించారు. ఈరోజు విశాఖలో ఆయన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలో 30 ఏళ్ళుగా కొనసాగడానికి ఎన్టీఆరే కారణమని చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్ తనను సోదరుడిలా భావించేవారని, అందుకే అప్పట్లో ఎన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు వచ్చినా తిరస్కరించానని తెలిపారు. కానీ, చంద్రబాబు వైఖరితో విసిగిపోయినందునే, వైఎస్సార్సీపీలో చేరానని వివరణ ఇచ్చారు. అవిశ్వాస తీర్మానం సమయంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటేయమని పొలిట్ బ్యూరో సమావేశంలో ఎంత చెప్పినా బాబు ససేమిరా అన్నారని దాడి చెప్పారు. గౌరవం లేని చోట ఇమడలేకే పార్టీని వీడానని తెలిపారు.