మినీ వ్యాన్ నుంచి దించుతుండగా పేలిన బాణసంచా.. ముగ్గురు సజీవదహనం!
- తమిళనాడులోని ఈరోడ్ లో ఘటన
- అన్ లోడ్ సందర్భంగా మంటలు
- తీవ్రంగా దెబ్బతిన్న భవనాలు, వాహనాలు
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. దీపావళి పండుగ వేళ అమ్మకాల కోసం వీటిని ఓ వ్యాపారి తెప్పించాడని పోలీసులు తెలిపారు. బాణసంచాను అమ్మేందుకు సదరు వ్యాపారికి లైసెన్స్ ఉందా? లేదా? అన్న విషయమై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నామనీ, త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామని పేర్కొన్నారు.