గుండెలు పిండేసే విషాదం ఇది!: కొండగట్టు బస్సు ప్రమాదంపై పవన్ కల్యాణ్
- మనసంతా భారంగా దుఃఖంతో నిండిపోయింది
- చనిపోయినవారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను
- తగిన నష్టపరిహారం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నా
కొద్ది క్షణాల్లో మృత్యువు పొంచి ఉందని తెలియని ఆ అమాయక ప్రయాణికులను తలచుకుంటే మనసు ద్రవించిపోతోంది. ఆర్టీసీ బస్సులు ప్రయాణించని ఈ ఇరుకైన ఘాట్ మార్గంలోకి ప్రమాదానికి గురయిన బస్సు అమాయకుల ప్రాణాలను బలితీసుకోడానికే వచ్చినట్లు అనిపిస్తోంది. నిండు ప్రయాణికులతో వెళుతున్న ఈ బస్సు లోయలోకి పడిపోవడం దురదృష్టకరం. చనిపోయినవారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాల వారికి సంతాపం తెలుపుతున్నాను. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి తగిన నష్టపరిహారం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నానని పవన్ తెలిపారు.