: రాష్ట్రంలోని ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరిక
మహాసేన్ తుపాను నుంచి రాష్ట్రానికి పెద్దగా ప్రమాదం లేకున్నా, రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో రెండో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. చెన్నైకి ఆగ్నేయంగా 1230 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తుపాను, గంటకు 15 కిమీ వేగంతో ఉత్తర దిశగా పయనిస్తోంది. కాగా, మరో 24 గంటల్లో 'మహాసేన్' పెనుతుపానుగా రూపాంతరం చెందుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.