: రామ్ చరణ్ వివాదంపై 'చిరు' స్పందన
కొద్దిరోజుల క్రితం రామ్ చరణ్ ఇద్దరు ఐటీ ఉద్యోగులపై దాడి చేసిన ఘటనపై కేంద్ర మంత్రి చిరంజీవి స్పందించారు. ఈ వ్యవహారంలో తాను మాట్లాడడానికేమీలేదని ఆయన అన్నారు. వివాదంపై రామ్ చరణ్ ఇప్పటికే వివరణ ఇచ్చాడని చిరు గుర్తు చేశారు. నేడు కాకినాడలో పర్యాటక శాఖ నిర్వహించిన ఓ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.