Telangana: పొత్తులపై చర్చలకు టీ-పీసీసీ కమిటీ ఏర్పాటు!
- తెలంగాణలో పొత్తులపై కాంగ్రెస్ కసరత్తు
- కమిటీ సభ్యులుగా ఉత్తమ్, కుంతియా, జానారెడ్డి, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క
- ఒకట్రెండు రోజుల్లో సమావేశం కానున్న కమిటీ
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పొత్తులపై కాంగ్రెస్ పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. పొత్తులపై చర్చలకు గాను టీ-పీసీసీ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియా, సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క ఉన్నారు. ఒకట్రెండు రోజుల్లో పీసీసీ కమిటీ సమావేశం కానున్నట్టు సమాచారం.