: తెలుగు ధ్వన్యనుకరణ మహోత్సవాలకు శ్రీకారం


తెలుగు భాషకు ప్రాచుర్యం పెంచేందుకు అధికారభాషా సంఘం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. విద్యార్ధుల్లో కళల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ, మిమిక్రీ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా నడుంబిగించాయి. హైదరాబాదులో ఈ రోజు ధ్వన్యనుకరణ మహోత్సవాలను అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను మిమిక్రీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళడమే ఈ ఉత్సవాల ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.

  • Loading...

More Telugu News