DS: నేను ‘కాంగ్రెస్’లో చేరుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవం!: డీఎస్
- నేను ‘కాంగ్రెస్’ లో చేరట్లేదు
- సీఎం కేసీఆర్ నుంచి నాకు ఎలాంటి సందేశం రాలేదు
- నాపై బాజిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా
టీఆర్ఎస్ నేత డి.శ్రీనివాస్ (డీఎస్) కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరబోతున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డీఎస్ క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, అవన్నీ అబద్ధాలని కొట్టిపారేశారు. సీఎం కేసీఆర్ నుంచి తనకు ఎలాంటి సందేశం రాలేదని చెప్పారు. ఈ సందర్భంగా తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు. తనపై బాజిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు.