: భారీ విజయంపై కన్నేసిన 'ఇండియన్స్'
ఐపీఎల్-6లో నిలకడైన ఆటతీరు ప్రదర్శిస్తున్న జట్లలో ముంబయి ఇండియన్స్ ఒకటి. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న ముంబయి నేడు పుణే వారియర్స్ తో తలపడనుంది. టోర్నీలో అత్యంత బలహీన జట్టుగా ముద్ర పడిన పుణే జట్టుపై భారీ విజయం సాధించడం ద్వారా నెట్ రన్ రేట్ మెరుగుపరుచుకోవాలని ముంబయి వ్యూహకర్తలు భావిస్తున్నారు. ఎందుకంటే, తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లే ప్లే ఆఫ్ దశకు చేరుకోనుండగా.. ఇక నుంచి ప్రతి మ్యాచ్ కూడా కీలకమే. గెలుపుతోపాటు రన్ రేట్ పెంచుకుంటే, ప్రత్యేక పరిస్థితుల్లో పాయింట్లు సమమైనప్పుడు అక్కరకొస్తుందని ముంబయి ఇండియన్స్ తలపోస్తోంది. ఈ పోరులో టాస్ గెలిచిన పుణే బ్యాటింగ్ ఎంచుకుంది.