: కంటతడి పెట్టిన కాజల్ సోదరి


టాలీవుడ్ అందాల భామ కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ ఇవాళ ఓ కార్యక్రమంలో కంటతడి పెట్టారు. అనాథ పిల్లలకోసం 'హెల్పింగ్ సొసైటీ వీకర్ సెక్షన్' స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తోన్న కార్యక్రమాల గురించి తెలుసుకున్న నిషా కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి. బిగ్ ఎఫ్ఎం రేడియో కేంద్రం ఈ రోజు హైదరాబాద్ లో నిర్వహించిన మాతృదినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నిషా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు సక్రిబాయితో పాటు అనాథ బాలలు కూడా పాల్గొన్నారు. హెల్పింగ్ సొసైటీ.. సంస్థలో 1000 మందికి పైగా అనాథలు ఆశ్రయం పొందుతున్నారు.

  • Loading...

More Telugu News