: పాకిస్తాన్ లో రిపోర్టర్ కు దేశ బహిష్కరణ


పాకిస్తాన్ తన నైజాన్ని మరోసారి చాటుకుంది. దేశంలో మానవ హక్కులు ఎంత ఘనంగా అమలు అవుతున్నాయో ప్రపంచానికి తెలియడం ఇష్టంలేదన్నట్టు.. న్యూయార్క్ టైమ్స్ పాత్రికేయుడు డెక్లాన్ వాల్ష్ కు దేశ బహిష్కరణ విధించింది. ఈ మేరకు పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నందున, 72 గంటల్లోగా దేశం విడిచి వెళ్ళాలని స్పష్టం చేసింది. అవాంఛనీయ కార్యకలాపాల కారణంగా వీసాను రద్దు చేస్తున్నట్టు కూడా తెలిపింది. వాల్ష్ పై తీవ్ర నిర్ణయానికి ఇంతకుమించి ప్రత్యేక కారణాలు వెల్లడించలేదు.

వాల్ష్ గత తొమ్మిదేళ్ళుగా పాకిస్తాన్ లో టైమ్స్ పత్రికకు బ్యూరో చీఫ్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా, తన పాత్రికేయుడిని దేశం నుంచి వెళ్ళిపొమ్మనడాన్ని టైమ్స్ తీవ్రంగా పరిగణిస్తోంది.

  • Loading...

More Telugu News