Congress: ‘కాంగ్రెస్’ నేతలు కాళ్లు పట్టుకున్నా సరే వారితో పొత్తు పెట్టుకోం: ఏపీ డిప్యూటీ సీఎం కేఈ

  • రేపు కర్నూలులో ధర్మపోరాట సభ
  • ఏర్పాట్లను పరిశీలించిన కేఈ
  • ‘కాంగ్రెస్’ తో టీడీపీ ఎట్టిపరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోదు

ఏపీలో కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు వార్తలపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మరోసారి స్పందించారు. రేపు కర్నూలులోని ఎస్టీబీసీ గ్రౌండ్స్ లో ధర్మపోరాట సభ నిర్వహించనున్నారు. ఈ ఏర్పాట్లను కేఈ కృష్ణమూర్తి, పలువురు టీడీపీ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతలు తమ కాళ్లు పట్టుకున్నా సరే వారితో పొత్తు పెట్టుకోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీతో టీడీపీ ఎట్టిపరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోదని అన్నారు.

ఉత్తరాంధ్రలో అభివృద్ధి జరగడం బీజేపీకి ఇష్టం లేదా?

రాష్ట్రం కోసం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని మంత్రి కళావెంకట్రావు అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదని బీజేపీ, వైసీపీ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఉత్తరాంధ్రలో అభివృద్ధి జరగడం బీజేపీకి ఇష్టం లేదా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో పొత్తులపై పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చిస్తామని, పొత్తులపై చంద్రబాబు తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

బీజేపీకి కొత్త అర్థం చెప్పిన రాజేంద్రప్రసాద్

బీజేపీ అంటే బ్రోకర్లు, జోకర్లు, పిచ్చోళ్ల పార్టీ అని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ కొత్త అర్థం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నేతలకు డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు. భోగాపురం ఎయిర్ పోర్టు టెండర్లపై ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమేనని, బీజేపీ నేతలకు దమ్ముంటే రాఫెల్, ఎస్సార్ కుంభకోణాలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై ఆయన విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబునాయుడు పోరాడుతుంటే, కేసుల మాఫీ కోసం జగన్ ప్రధాని మోదీతో లాలూచీపడ్డారని ఆరోపించారు. మోదీ, జగన్, పవన్ లు కలిసి ఏపీపై కుట్ర పన్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News