: అఫ్జల్ మృతదేహాన్ని అప్పగించాలని కుటుంబం అభ్యర్థన


ఉగ్రవాది అఫ్జల్ గురు భౌతిక దేహాన్ని తమకు అప్పగించాలని అతని కుటుంబం కోరుతోంది. మృతదేహాన్ని అప్పగిస్తే సరైన రీతిలో అంత్యక్రియలు జరుపుతామని చెబుతూ, అఫ్జల్ కుటుంబం తీహార్ జైలు అధికారులకు లేఖ రాసిందని అతని బంధువు యాసిన్ తెలిపారు. ఇదే తమ ఏకైక డిమాండ్ అని అతని కుటుంబం అంటోంది. ఉరిశిక్ష అమలు చేసిన అనంతరం అఫ్జల్ కు తీహార్ జైలులోనే అంత్యక్రియలు పూర్తి చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News