jonnavitthula: నా సంస్కృత పదాలు రిక్షావాడికి కూడా అర్థమవుతాయట!: జొన్నవిత్తుల
- కోడి రామకృష్ణతో మంచి సాన్నిహిత్యం వుంది
- ఆయన దర్శకత్వంలోని 'దేవుళ్లు'కి ఓ పాట రాశాను
- అప్పుడు ఆయన ఒక మాట అన్నారు
తాజాగా 'చెప్పాలని వుంది' కార్యక్రమంలో పాల్గొన్న జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ, కెరియర్ పరంగా తనకి ఎదురైన కొన్ని అనుభవాలను గురించి ప్రస్తావించారు. "కోడి రామకృష్ణ గారి సినిమాలకు నేను ఎక్కువ పాటలు రాశాను .. ఆయనతో నాకు మంచి సాన్నిహిత్యం వుంది. ఆయన దర్శకత్వం వహించిన 'దేవుళ్లు' సినిమా కోసం ఒక పాట రాశాను.
'అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః' అనే పాటను రాశాను. 'నిజధీర గంభీర శబరీ గిరీ శిఖర ఘనయోగ ముద్రాయ నమః' వంటి పదాలను ఈ పాటలో వేశాను .. అది ఆయన ఓకే చేశారు. నిజం చెప్పాలంటే ఇలాంటి పాటను ఏ ఎన్టీ రామారావుగారికో పెట్టాలి .. కానీ ఆ పాటను తీసినది ఇద్దరు పిల్లల మీద. అదే వేరే వాళ్లయితే 'పిల్లల మీద పాటకి సంస్కృత పదాలు ఎందుకండీ .. చాదస్తం కాకపోతేనూ' అనేవాళ్లు. నేను సంస్కృత పదాలు ఉపయోగించినా రిక్షావాడికి కూడా అర్థమవుతుందని కోడి రామకృష్ణ అన్నారు .. అది ఆయన గొప్పతనం .