జనసేనలోకి పంతం నానాజీ.. తూర్పుగోదావరిలో కాంగ్రెస్కు షాక్
- జనసేన విధివిధానాలు నచ్చడంతోనే పార్టీలోకి
- పార్టీ టికెట్ ఆశించడం లేదన్న నానాజీ
- కాంగ్రెస్తో తనకు విభేదాలు లేవని స్పష్టీకరణ
కాంగ్రెస్ పార్టీతో తనకు ఎటువంటి విభేదాలు లేవని నానాజీ తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత పార్టీకి మనుగడ లేదని తెలిసినా పార్టీ మారకుండా సేవలు అందించానన్నారు. కాంగ్రెస్ను వీడుతున్నా తన వెంట ఒక్క కార్యకర్తను కూడా తీసుకెళ్లడం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్లో 32 ఏళ్ల పాటు పనిచేశానని, ఎన్నో పదవులు అధిష్ఠించానని నానాజీ వివరించారు. కాగా, నానాజీ పార్టీ వీడడం జిల్లాలో కాంగ్రెస్కు పెద్ద షాకేనని చెబుతున్నారు.