Hyderabad: హైదరాబాద్ లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టివేత
- కర్ణాటక నుంచి తీసుకొస్తున్న మత్తు మందు ట్యాబ్లెట్లు
- ఎనిమిది వేలకు పైగా మత్తుమందు ట్యాబ్లెట్లు సీజ్
- రాజేష్ అనే వ్యక్తిని అరెస్టు చేశాం: ఎక్సైజ్ అధికారులు
హైదరాబాద్ లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఎక్సైజ్ అధికారుల సమాచారం ప్రకారం, కర్ణాటక నుంచి మత్తుమందు ట్యాబ్లెట్లు తెచ్చి విక్రయిస్తున్న రాజేష్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్టు చెప్పారు. నిందితుడి నుంచి 130 మత్తు మందు ట్యాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నామని, ఆ తర్వాత అతని ఇంటికి వెళ్లి సోదా చేయగా 8 వేల మత్తుమందు ట్యాబ్లెట్లు దొరికాయని, వాటిని సీజ్ చేసినట్లు తెలిపారు. విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, నిర్మాణ రంగంలో పని చేసే కార్మికులు, రోజుకూలీ చేసే వాళ్లకు ఈ మత్తుమందు ట్యాబ్లెట్లను రాజేష్ సరఫరా చేసేవాడని తమ దర్యాప్తులో తేలినట్లు చెప్పారు.