Chandrababu: ఆమె మృతి రాష్ట్రానికే తీరనిలోటు: చంద్రబాబు నాయుడు

  • ఈరోజు తెల్లవారుజామున కన్నుమూసిన చెన్నుపాటి విద్య
  • మహిళాభ్యుదయం కోసం ఎనలేని కృషి
  • విచారం వ్యక్తం చేసిన ఏపీ సీఎం

విజయవాడ మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య (84) మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రెండుసార్లు లోక్ సభ సభ్యురాలిగా ఆమె చేసిన సేవలు ప్రశంసనీయం అని అన్నారు.
మహిళాభ్యుదయం కోసం ఎనలేని కృషి చేసిన ఆమె మృతి విజయవాడకే కాకుండా రాష్ట్రానికే తీరనిలోటని విచారం వ్యక్తం చేశారు. కాగా, ఈరోజు తెల్లవారుజామున కన్నుమూసిన విద్య అంత్యక్రియలు సోమవారం విజయవాడలో జరగనున్నట్లు ఆమె బంధువులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News