: దారి తప్పిన తుపాన్... పెరగనున్న వేడి!


భానుడి ప్రతాపానికి రాష్ట్ర ప్రజలు విలవిల్లాడుతున్నారు. వేడిగాలుల తీవ్రతకు అల్లాడిపోతున్నారు. విశాఖ తీరప్రాంతంలో ఏర్పడిన వాయుగుండం తుపాన్ గా మారింది. అయితే ఇది వాయువ్యంగా వీస్తున్న గాలుల తీవ్రతకు దిశమార్చుకుందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. నిన్న విశాఖకు 5 వందల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తుపాను ఈవేళ తమిళనాడు వైపు మళ్ళింది. దీంతో రాష్ట్రానికి ఉపశమనం లభిస్తుందని ఆశించిన వారికి నిరాశే కలిగింది. తాజా పరిణామాలతో భానుడు మరింత ప్రభావం చూపే అవకాశముంది. గతంలో ఎన్నడూ లేనంత విధంగా రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదతున్నాయి.

  • Loading...

More Telugu News