Hyderabad: ఎగుమతులు పెంపొందించటానికి కార్యచరణ ప్రణాళికను రూపొందిస్తాం: తెలంగాణ సీఎస్

  • ఎగుమతులు పెరగడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిబంధనలను కోరిన తెలంగాణ సీఎస్ 
  • 15 రోజులలోగా అందించాలని కేంద్ర వాణిజ్యశాఖ అధికారులకి వినతి 
  • ఎగుమతుల పరంగా అవసరమున్న ముఖ్యమైన రంగాలపై దృష్టి

ఈరోజు తెలంగాణ సచివాలయంలో ప్రమోషన్ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. మెడికల్ టూరిజం, వ్యవసాయం, పాడి, మత్స్య, గ్రానైట్, టెక్స్ టైల్ తదితర రంగాలలో తెలంగాణ రాష్ట్రం నుండి ఎగుమతులు పెరగడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిబంధనల వివరాలను 15 రోజులలోగా అందించాలని కేంద్ర వాణిజ్యశాఖ అధికారులను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె జోషి కోరారు.

అనంతరం వివిధ శాఖల అంశాల వారీగా ఎగుమతులు పెంపొందించటానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న కార్యకలాపాలను కొనసాగిస్తూ మరిన్ని అవకాశాలు పొందటానికి చర్యలు తీసుకోవాలన్నారు. మెడికల్ టూరిజంపై ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించారు. వాణిజ్య ఎగుమతులకు సంబంధించి సెమినార్లు, కాన్ఫరెన్సులు, వర్క్ షాపులు, అవుట్ రిచ్ కార్యక్రమాలు సంబంధిత వర్గాలతో నిర్వహించాలన్నారు.
 
తెలంగాణ రాష్ట్రానికి ఎగుమతుల పరంగా అవసరమున్న ముఖ్యమైన రంగాలపై దృష్టి సారించి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలన్నారు. ఎగుమతులకు సంబంధించి వివిధ దేశాలలో అమలవుతున్న నిబంధనలపై అవగాహన పెంచుకోవాలన్నారు. రాష్ట్రం నుండి ఫార్మా, ఆర్గానిక్ కెమికల్స్, కాటన్, సెరల్స్, పెరల్స్, ఎలక్ట్రికల్ మిషనరీ తదితర వస్తువులు ఎగుమతి అవుతున్నాయన్నారు. ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కేంద్ర వాణిజ్య శాఖ అధికారులు డి.రవి, సత్యం శర్ధ, డి.కె.షికార్ తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News