: హైదరాబాద్ లో 'అమెరికా' పాథ్ ల్యాబ్


వైద్య సేవల రాజధానిగా వెలుగొందుతున్న హైదరాబాద్ నగరంలో మరో ప్రతిష్ఠాత్మక వైద్య పరీక్షల కేంద్రం ఏర్పాటు కాబోతుంది. అమెరికాకు చెందిన పిట్స్ బర్గ్ యూనివర్సీటీ అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య పరీక్షల కేంద్రం (క్లినికల్ పాథాలజీ లాబొరేటరీ) ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఇందుకోసం సిటిజన్ హాస్పిటల్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. 'ఆమ్ పాథ్' పేరుతో ఏర్పాటు కానున్న ఈ పరీక్షా కేంద్రం తొలిదశలో సిటిజన్ష్ హాస్పిటల్ రోగులకు సేవలు అందిస్తుంది. ఆగస్టు నుంచి సిటిజన్ హాస్పిటల్ కార్యకలాపాలు ప్రారంభించనుంది. తర్వాతి దశలో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల రోగులతోపాటు, మధ్యప్రాచ్య దేశాలకు కూడా సేవలందించేలా పరీక్షల కేంద్రాన్ని పిట్స్ బర్గ్ యూనివర్సీటీ అభివృద్ధి చేస్తుంది.

  • Loading...

More Telugu News