కోర్టు తీర్పు తరువాత ఒక్కసారిగా పెల్లుబికిన భావోద్వేగం... కన్నీటి పర్యంతమైన స్టాలిన్!
- మెరీనా బీచ్ లో అంత్యక్రియలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
- మైకులో చెప్పగానే రాజాజీ హాల్ ముందు ఉద్వేగం
- శవపేటికను పట్టుకుని విలపించిన కరుణ కుటుంబీకులు
అక్కడే వేలాదిగా ఉన్న కార్యకర్తలు ఒక్కసారిగా ముందుకు దూసుకు వచ్చి, 'కలైంజర్ వాంగే' అని నినాదాలు చేశారు. హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్న సంతృప్తి స్టాలిన్ తదితరుల్లో కనిపించింది. అనుకున్నట్టుగానే తమ నేతకు గౌరవం దక్కుతుందన్న భావన కార్యకర్తల్లో కనిపించింది. అప్పటివరకూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ, తమకు మెరీనా బీచ్ కావాలంటూ నివాళులు అర్పిస్తున్న డీఎంకే కేడర్, ఇప్పుడు 'కలైంజర్ కలైంజర్' అంటూ నినాదాలు చేస్తున్నారు.