11కి పెరిగిన క్వారీ మృతుల సంఖ్య... మరో ఐదుగురి పరిస్థితి విషమం!
- ఐదుగురి పరిస్థితి విషమం
- శ్రీనివాస సుహాస్ కంపెనీ గనుల్లో ప్రమాదం
- మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్న జగన్
క్వారీలో మంటలు చెలరేగి, అక్కడి రెండు షెడ్లు, ఒక లారీ, మూడు ట్రాక్టర్లు దగ్ధమయ్యాయంటే, ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో తెలుసుకోవచ్చు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నామని కర్నూలు కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఘటన తరువాత క్వారీ యజమానులు పరార్ అయ్యారని, వారి కోసం వెతుకుతున్నామని అన్నారు.
కాగా, క్వారీ పేలుడు ఘటన తనను కలచి వేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేసిన ఆయన, ఘటన వెనుక ఎవరున్నా చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు.