రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడిపై ప్రతిపక్షాల ఫిర్యాదు యత్నం!
- సభలో పక్షపాతం చూపిస్తున్నారంటూ వెంకయ్యపై ఆరోపణ
- తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్న నేతలు
- లేఖపై సంతకాల సేకరణ
సభలో మాట్లాడేందుకు తమకు అనుమతి ఇవ్వడం లేదని, మాట్లాడినప్పుడు పదేపదే అడ్డు తగులుతున్నారని, రాజ్యసభ టీవీని అధికార పార్టీకి అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారని ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతలు వెంకయ్యపై ఆరోపణలు గుప్పిస్తూ లేఖ తయారుచేశారు. సభ్యుల సంతకాల సేకరణ పూర్తయిన అనంతరం దానిని వెంకయ్యనాయుడికి పంపనున్నారు.